జనవరి 4న రాజమండ్రిలో 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్

  • రామ్ చరణ్ లీడ్ రోల్ లో గేమ్ చేంజర్
  • శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం
  • జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇటీవలే అమెరికాలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం కావడంతో... చిత్రబృందం ఆ ఊపులోనే ఏపీలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేసింది. 

ఇవాళ నిర్మాత దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్లపై చర్చించారు. పవన్ వీలునుబట్టి జనవరి 4 లేదా 5వ తేదీన ఈవెంట్ ఉంటుందని దిల్ రాజు ఇంతకుముందే చెప్పారు. ఇవాళ పవన్ తో మాట్లాడిన అనంతరం ఈవెంట్ కు జనవరి 4వ తేదీని ఖరారు చేశారు. రాజమండ్రిలో ఈ ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. 

ఇవాళ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి వెళ్లిన దిల్ రాజు.... పవన్ ను కలిసి మాట్లాడారు. రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలని పవన్ ను ఆహ్వానించారు. ఈ భేటీలో ఇరువురి మధ్య సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది.


More Telugu News