అట్టహాసంగా ప్రారంభించిన కామన్ డైట్ ఆరంభ శూరత్వమేనా?: కేటీఆర్
- ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
- గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటూ నిలదీత
- ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేటీఆర్
- కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శం ఉంటే ఇప్పుడు అంతులేని నిర్లక్ష్యమంటూ మండిపాటు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. "అట్టహాసంగా ప్రారంభించిన కామన్ డైట్ ఆరంభ శూరత్వమేనా? గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అందుకే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అభద్రతా భావం పెంచుతున్నారా ? ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా ఉన్న గురుకులాలపై ఇప్పుడు అంతులేని నిర్లక్ష్యం చూపిస్తున్నారు" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.