బేబీ బంప్‌తో స్టార్‌ క్రికెట‌ర్ భార్య‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

  • బేబీ బంప్‌తో క‌నిపించిన కేఎల్ రాహుల్ భార్య‌ అతియా శెట్టి
  • మెల్‌బోర్న్‌ స్టేడియంలో అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి హ‌ల్‌చ‌ల్‌
  • త‌మ అభిమాన క్రికెట‌ర్ తండ్రి కాబోతున్నందుకు ఫ్యాన్స్ ఖుషీ
బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు సునీల్ శెట్టి త‌న‌య‌, హీరోయిన్ అతియా శెట్టి, టీమిండియా స్టార్ క్రికెట‌ర్ గ‌తేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం అతియా ప్రెగ్నెంట్‌గా ఉంది. మెల్‌బోర్న్‌లో జ‌రుగుతున్న నాలుగో టెస్టు సంద‌ర్భంగా స్టేడియానికి వెళ్లిన ఆమె బేబీ బంప్‌తో క‌నిపించింది. 

విరాట్ కోహ్లీ భార్య, న‌టి అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి ఆమె క‌నిపించింది. ఈ ఇద్ద‌రితో పాటు తెలుగు ఆట‌గాడు నితీశ్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి కూడా క‌నిపించారు. ఇక అతియా శెట్టి బేబీ బంప్‌తో క‌నిపించ‌డంతో కేఎల్ రాహుల్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమె బేబీ బంప్‌తో క‌నిపించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్ వైర‌ల్ అవుతోంది. 


More Telugu News