తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ..!

  • కోరుకొండలో పోలీసుల తనిఖీలు
  • ఐదుగురు మహిళలు, 14 మంది పురుషుల అరెస్ట్
  • గుంటూరు ప్రాంతానికి చెందినవారుగా గుర్తింపు
నూతన సంవత్సరం సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారనే వార్త తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది. దీంతో సోమవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలోని ఓ కల్యాణ మంటపంలో పార్టీ చేసుకుంటున్న యువతీయువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది.

పార్టీని అడ్డుకున్న పోలీసులు.. ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అరెస్ట్ చేశారు. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందిన వారని అధికారవర్గాల సమాచారం. నూతన సంవత్సరం సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News