మెల్‌బోర్న్ టెస్ట్.. కష్టాల్లో భారతజట్టు.. 33 పరుగులకే ముగ్గురు కీలక ఆటగాళ్ల ఔట్
మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆదిలోనే భారత జట్టు కష్టాల్లో చిక్కుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల భారీ లక్ష్యంతో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 33 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. లంచ్ సమయానికి భారత జట్టు రోహిత్ శర్మ (9), కేఎల్ రాహుల్ (0), విరాట్ కోహ్లీ (5) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 25 పరుగుల వద్ద వరుసగా రోహిత్‌శర్మ, రాహుల్ ఔట్ కాగా, మరో 8 పరుగులు జోడించాక కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు.
అంతకుముందు ఆస్ట్రేలియా 234 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని భారత్‌కు 340 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు కోల్పోయిన మూడు వికెట్లలో రెండు కమిన్స్‌కు దక్కగా, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ తీసుకున్నాడు.