ఏపీ కొత్త‌ సీఎస్‌గా విజ‌యానంద్ ఖ‌రారు

  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
  • రేపటితో ముగియనున్న ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం
  • ఆయ‌న స్థానంలో నూత‌న సీఎస్‌గా విజ‌యానంద్ నియామ‌కం
  • 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్
  • ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్య‌త‌లు
ఏపీ ప్రభుత్వ కొత్త‌ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. దాంతో నూత‌న సీఎస్‌గా విజ‌యానంద్‌ను స‌ర్కార్ నియమించింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. కాగా, విజయానంద్ ఇంత‌కుముందు 2022లో ఏపీ జెన్ కో ఛైర్మన్‌గా.. 2023లో  ఏపీ ట్రాన్స్ కోకు సీఎండీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.


More Telugu News