పుతిన్ క్షమాపణతో సంతృప్తి చెందని అజర్ బైజాన్ అధ్యక్షుడు
- కజకిస్థాన్ లో కూలిపోయిన అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం
- తమ నగరంలో పరిస్థితుల కారణంగానే విమానం కూలిపోయిందన్న పుతిన్
- అజర్ బైజాన్ అధ్యక్షుడు అలియేవ్ కు క్షమాపణ
- నేరాన్ని అంగీకరించాల్సిందేనంటూ అలియేవ్ స్పష్టీకరణ
గ్రోజ్నీ నగరంలోని పరిస్థితుల కారణంగా అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం కూలిపోవడం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ కు క్షమాపణలు చెప్పడం తెలిసిందే. అయితే, పుతిన్ క్షమాపణల పట్ల అలియేవ్ ఏమాత్రం సంతృప్తి చెందినట్టు కనిపించడంలేదు.
రష్యా గడ్డపై నుంచి జరిగిన కాల్పుల కారణంగానే తమ విమానం కూలిపోయిందని ఆయన ఇవాళ ఆరోపించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందే అయినా, ఆ ప్రమాదానికి గల కారణాన్ని దాచేందుకు రష్యా ప్రయత్నించిందని అన్నారు. పైగా, ప్రమాద ఘటనపై తప్పుదారి పట్టించే కథనాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చేసిన తప్పును రష్యా అంగీకరించాల్సిందేనని అలియేవ్ స్పష్టం చేశారు.