గేమ్ చేంజర్ బడ్జెట్ మామూలుగా లేదు... 5 పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు
- రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా గేమ్ చేంజర్
- స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం
- జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- ఈ చిత్రంలోని పాటల గురించి ఆసక్తికర అంశాలు వెల్లడి
తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ మేనియా మొదలైంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా... స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.
తాజాగా, గేమ్ చేంజర్ కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. ఈ సినిమాలో 5 పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశారు. ఈ పాటల ట్యూన్లు, సంగీతం, లిరిక్స్, కొరియోగ్రఫీ, విజువల్స్... ఇలా అన్నీ దేనికదే ప్రత్యేకంగా ఉండేటట్టు దర్శకుడు శంకర్ ఓ ట్రీట్ లో రూపొందించాడు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా ప్రతి ఫ్రేమ్ గ్రాండియర్ గా ఉండేందుకు తమవంతు సహకారం అందించారు.
ఈ చిత్రంలో జరగండి అనే పాట కోసం 70 అడుగుల ఎత్తు ఉన్న కొండ... దానిపై విలేజ్ సెట్ వేసి కళ్లు చెదిరే రీతిలో 600 మంది డ్యాన్సర్లతో 8 రోజులు చిత్రీకరణ జరిపారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అదిరిపోయింది. ఈ పాట కోసం మొదటిసారిగా పర్యావరణ హిత కాస్ట్యూమ్స్ ను వాడడం విశేషం. జనపనారతో ఈ ఎకో ఫ్రెండ్లీ కాస్ట్యూమ్స్ ను అశ్విన్-రాజేశ్ రూపొందించారు.
ఇక, ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్... రా మచ్చా మచ్చా! ఈ గీతానికి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య నృత్యరీతులు సమకూర్చడం విశేషం. భారతదేశ జానపద కళకు నీరాజనం అనదగ్గ రీతిలో ఈ పాటను శంకర్ రూపొందించడం హైలైట్. ఎందుకంటే, దేశంలోని వివిధ రకాల జానపద నృత్యశైలులను ఈ పాటలో పొందుపరిచారు.
ఈ సాంగ్ లో రామ్ చరణ్ పక్కన 1000 మంది జానపద కళాకారులు కనిపిస్తారు. గుస్సాడీ (ఆదిలాబాద్, తెలంగాణ), కొమ్ము కోయ, తప్పెట గుళ్లు (ఆంధ్రప్రదేశ్), ఘుమ్రా (ఒడిశా), గొరవర (కర్ణాటక), రణప (ఒడిశా), పల్కా (ఝార్ఖండ్), హళక్కి (ఒక్కళిగ-కర్ణాటక), దురువా (ఒడిశా) జానపద నృత్య కళలను ఈ పాటలో చూడొచ్చు.
ఈ చిత్రంలో మరో హైలైట్ ఏంటంటే... నానా హైరానా అనే డ్యూయెట్ ను ఇన్ ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించారు. ప్రతి ఫ్రేములో విభిన్నమైన రంగులను ఆవిష్కరించేందుకు ఈ కెమెరా సాయపడుతుంది. ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లా...? అనిపించే న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్లలో రామ్ చరణ్, కియారా అద్వానీలపై ఈ పాటను షూట్ చేశారు.
ఇక ధోప్ (DHOP) సాంగ్ ను ప్రధానంగా యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఇది టెక్నో పాప్-టెక్నో డ్యాన్స్ జానర్ కిందికి వస్తుంది. రామోజీ ఫిలింసిటీలోని 3 ఖరీదైన సెట్లపై ఈ పాటను 8 రోజుల పాటు చిత్రీకరించారు. ధోప్ సాంగ్ కోసం రష్యా నుంచి 100 మంది డ్యాన్సర్లను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకురావడం విశేషం.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐదో పాట గురించి. ఈ పాట ఇంత వరకు రిలీజ్ కాలేదు. దీన్ని థియేటర్లో వెండితెరపైనే చూడాలని, ఇది ఆడియన్స్ కు ఒక సర్ ప్రైజ్ అని చిత్రబృందం చెబుతోంది. ఈ పాటను గోదావరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించారట.