బొత్స కాళ్లు పట్టుకున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- సంస్కారంతో పలకరిస్తే దుష్ప్రచారం చేస్తారా?
- నవంబర్ 11న అసెంబ్లీ లాబీలో ఉండగా బొత్స సత్యనారాయణ అటువైపుగా వచ్చారు
- మిగతా ఎమ్మెల్యేల మాదిరిగా లేచి సంస్కారంతో పలకరించా
- కాళ్లు మొక్కానంటూ జరగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కారంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. నవంబరు 11న అసెంబ్లీ లాబీలో ఇతర ఎమ్మెల్యేలతో పాటు కూర్చొని ఉన్న సమయంలో బొత్స సత్యనారాయణ అటువైపుగా వచ్చారని, అందరితో పాటు తాను కూడా లేచి సంస్కారంతో పలకరించానని మంత్రి వెల్లడించారు. అంతకుమించి అక్కడ ఏమీ జరగలేదని, సంస్కారంతో తాను నమస్కారం పెడితే దుష్ప్రచారం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
విజయనగరం జిల్లాలో తమ కుటుంబానికి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందని, బొత్స కుటుంబంపై పోరాడుతున్నామని, అలాంటి తాను బొత్స కాళ్లు ఎందుకు పట్టుకుంటానంటూ మండిపడ్డారు. దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. జిల్లాలో బొత్స కుటుంబం వల్ల చాలా మందికి అన్యాయం జరిగిందని, అలాంటివాళ్లు వివరాలు అందజేస్తున్నారని, చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ హెచ్చరించారు. బొత్స కుటుంబం జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు.
ఈమేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, మంత్రి శ్రీనివాస్ బొత్స సత్యనారాయణ కాల్లు మొక్కారంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు వైరల్గా మారాయి.