రండి... ప్రీగా తీసుకెళ్లండి!... బాక్సింగ్ డే సందర్భంగా బంపర్ ఆఫర్ ఇచ్చిన దుకాణదారు

  • ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే సందర్భంగా ఉచితం అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించిన మాల్ యజమాని
  • మాల్‌కు యువకులు పోటెత్తడంతో తొక్కిసలాట
  • 30 సెకనుల వ్యవధిలో 400లకు పైగా వస్తువులు ఖాళీ
సహజంగా ఏదైనా షాపు ప్రారంభోత్సవం సందర్భంగా 50 శాతం లేదా 80 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తేనే జనాలు క్యూకడతారు. అందులోనూ పండుగ సీజన్‌లో ఇలాంటి ఆఫర్లు పెడితే జనాలు మరీ ఎగబడతారు. ఒకవేళ నచ్చిన వస్తువులను ఫ్రీ (ఉచితం)గా తీసుకువెళ్లవచ్చు అంటూ బంపర్ ఆఫర్ ఇస్తే జనాలు పోటెత్తుతారు.

అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరిగింది. బాక్సింగ్ డే సందర్భంగా ఓ మాల్ యజమాని ఇచ్చిన బంపర్ ఆఫర్‌కు జనాలు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. పెర్త్‌కు చెందిన స్ట్రీట్ ఎక్స్ అనే మాల్ యజమాని డేనియల్ బ్రాడ్‌షా తరచూ వినూత్న మార్కెటింగ్ చేస్తుంటారు. 

ఈ క్రమంలో బాక్సింగ్ డే సందర్భంగా తాను వందలాది మందికి టీషర్టులు ఫ్రీగా ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇంకేముంది వందలాది యువకులు మాల్‌లోకి ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఓ వ్యక్తి అయితే ముందు జాగ్రత్త చర్యగా సైకిల్ హెల్మెట్, ప్యాడ్స్ ధరించి మరీ మాల్ లోకి వచ్చాడు.  
 
ఈ గివ్ అవేపై మాల్ యజమాని డేనియల్ బ్రాడ్‌షా మాట్లాడుతూ .. వినియోగదారుల కోసం ఏదైనా సరదాగా చేయాలన్న ఉద్దేశంతో మాల్‌ను పూర్తిగా ఉచితంగా ఉంచినట్లు తెలిపారు. సుమారు 400 వస్తువులు కేవలం 30 సెకన్లలో ఖాళీ అయ్యాయని ‌చెప్పాడు. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగిందని, అయితే ఎవరూ గాయపడలేదని తెలిపారు. 

కొందరు వ్యక్తులు మాల్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా ఒకరి చేతుల్లోంచి మరొకరు దుస్తులు లాక్కోవడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.


More Telugu News