తెలంగాణలో గిర్మాపూర్-యాదాద్రి ఆర్ఆర్ఆర్ పనులకు టెండర్లు పిలిచిన కేంద్రం
- గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణం
- రెండేళ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తి చేయాలన్న కేంద్రం
- నాలుగు విభాగాలుగా విభజించి టెండర్లు పిలిచిన కేంద్రం
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.
మొత్తం నాలుగు విభాగాలుగా విభజించి రూ.5,555 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. రెండేళ్లలో ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తి చేయాలని టెండర్ ఆహ్వాన నిబంధనల్లో స్పష్టం చేసింది.
ప్యాకేజీ 1లో భాగంగా సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్లు, ప్యాకేజీ 2లో భాగంగా రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు 26 కిలోమీటర్లు, ప్యాకేజీ 3లో భాగంగా ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు, ప్యాకేజీ 4లో భాగంగా ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణ పనులకు కేంద్రం టెండర్లను పిలిచింది.