కేటీఆర్ నోరు, ఒళ్లు అదుపులో పెట్టుకుంటే మంచిది: రఘునందన్ రావు
- ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు
- ఈడీ విచారణను కేటీఆర్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న రఘునందన్ రావు
- జైలు లోపల ఎలా ఉంటుందో చూసి రావాలని వ్యాఖ్య
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ నోటీసులపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఖర్చు చేసినా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి చెప్పకుండా కోట్ల రూపాయలను విదేశీ కంపెనీకి తరలించారని... అందుకే కేటీఆర్ పై ఈడీ కేసు నమోదయిందని అన్నారు.
ఈడీ విచారణను కేటీఆర్ కచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని రఘునందన్ రావు చెప్పారు. ఈడీ, మోడీ, బోడి అని నోరు పారేసుకున్న కేటీఆర్... ఇప్పుడు నోరు, ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. దమ్ముంటే తనను అరెస్ట్ చెయ్ అంటూ ట్వీట్ చేసిన ట్విట్టర్ టిల్లు... కేసు నమోదు కాగానే కోర్టుకు వెళ్లాడని ఎద్దేవా చేశారు. దమ్ముంటే జైలుకు వెళ్లాలని... జైలు లోపల ఎలా ఉంటుందో చూసి రావాలని అన్నారు.