నేను ఎక్కడికీ పారిపోలేదు: పేర్ని నాని
- లాయర్ల సూచన మేరకు మీడియా ముందుకు రాలేదన్న పేర్ని నాని
- పోలీసు విచారణ కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువయిందని అసహనం
- తనను, తన కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మండిపాటు
తాను పారిపోయానని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మచిలీపట్నంలోనే ఉన్నానని... తన లాయర్ల సూచన మేరకే మీడియా ముందుకు రాలేదని చెప్పారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ గోడౌన్ లో బియ్యం బస్తాలు తగ్గాయని చెపితే... దానికి నగదు చెల్లించామని... అయినా కక్ష కట్టి తమపై కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు. ఏదీ తేలక ముందే తనను దొంగ అంటున్నారని చెప్పారు. పోలీసు విచారణ కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువయిందని అసహనం వ్యక్తం చేశారు.
జనవరి 2వ తేదీలోగా తనను, తన కుమారుడిని అరెస్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారని పేర్ని నాని చెప్పారు. ఈ నెల 30వ తేదీన బెయిల్ పిటిషన్ పై తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. తమ అధినేత జగన్ కంటే ఎక్కువగా తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు.