'పుష్ప' స్టైల్‌లో నితీశ్ రెడ్డి సెల‌బ్రేష‌న్స్‌.. అంబ‌టి సెటైరిక‌ల్ ట్వీట్‌!

   
మెల్ బోర్న్ వేదిక‌గా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్ రెడ్డి అజేయ‌ సెంచరీతో అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. అయితే, అంత‌కుముందు అత‌ని అర్ధ శ‌త‌కం సెల‌బ్రేష‌న్స్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. పుష్ప స్టైల్లో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ను అనుకరించాడు. 

కాగా, వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. నితీశ్ రెడ్డి సెల‌బ్రేష‌న్స్ తాలూకు వీడియోను పంచుకుంటూ సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వంపై ప‌రోక్షంగా ఆయ‌న సెటైర్లు వేశారు. "ప్ర‌పంచాన్నే ప్ర‌భావితం చేస్తున్న పుష్ప హీరోను వేధిస్తూ తెలుగు సినిమాని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే న‌మ్మేదెలా అబ్బా" అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌రిగిన పరిణామాల‌పైన ఆయ‌న వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశార‌ని పలువురు కామెంట్లు చేస్తున్నారు.  


More Telugu News