మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరైన ద్రౌపది ముర్ము, మోదీ, అమిత్ షా
- నిగంబోధ్ ఘాట్ లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
- సిక్కు సంప్రదాయం ప్రకారం జరుగుతున్న అంత్యక్రియలు
- పార్థివదేహం వద్ద కుటుంబ సభ్యుల ప్రార్థనలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ లో జరుగుతున్నాయి. సైనిక లాంఛనాలతో, సిక్కు సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. పార్థివదేహం వద్ద కుటుంబ సభ్యులు ప్రార్థనలు నిర్వహించారు.
అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్కడ్, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు మంత్రులు, సోనియగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, కాంగ్రెస్ కీలక నేతలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లు హాజరయ్యారు.