బాలయ్య ప్రశ్నకు నిర్మాత సురేశ్ బాబు ఆసక్తికర జవాబు
- అన్‌స్టాపబుల్ 4వ సీజన్ తాజా ఎపిసోడ్‌లో నిర్మాత సురేశ్ బాబు
- తొలుత ఇండస్ట్రీలోకి రావాలనే అసక్తే లేదన్న సురేశ్ బాబు
- కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేవాడినన్న సురేశ్ బాబు
బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ 4వ సీజన్ తాజా ఎపిసోడ్‌లో పాల్గొన్న నిర్మాత సురేశ్ బాబు తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. అందంగా ఉండి కూడా హీరో కాకుండా నిర్మాత ఎందుకయ్యవ్? అంటూ బాలకృష్ణ వేసిన ప్రశ్నకు సురేశ్ బాబు సమాధానమిస్తూ.. అసలు తనకు ఇండస్ట్రీలోకి రావాలనే అసక్తే లేదని చెప్పారు.
సినిమాలొద్దు.. ఇక్కడ కష్టం.. బాగా చదువుకోండని చిన్నతనంలో తమ తండ్రి రామానాయుడు చెప్పారన్నారు. పెద్దయ్యాక చెన్నైలో ఉన్న సమయంలో తనను చూసిన దర్శకులు హీరోగా అవకాశాల గురించి చెబితే వద్దని చెప్పేవాడినని అన్నారు.
తమ తండ్రి .. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌కు సంబంధించిన ఎస్‌పీ లోగోలో 'ఎస్'పై వెంకటేశ్‌ను నిలబెట్టి స్టార్ అవుతాడని, 'పీ'పై తనను నిలబెట్టి ప్రొడ్యూసర్ అవుతావని చెప్పారన్నారు. వెంకటేశ్‌తో సినిమా చేసేందుకు ఎవరైనా కథ తీసుకువస్తే ముందుగా తాను నిర్మాతగా కథ వినేవాడినని, ప్రొడ్యూసర్‌కు డబ్బులు వస్తాయా? లేదా? అనేది చూసే వాడినని, ఒకవేళ కథ నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేవాడినని అన్నారు.