దారితప్పిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్... గంజాయి అమ్ముతూ పట్టుబడిన వైనం
- గంజాయి విక్రయిస్తూ దొరికిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
- 1.1కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు
- కూకట్‌పల్లి వసంత నగర్ బస్‌స్టాఫ్ వద్ద ఘటన
చెడు వ్యసనాలకు అలవాటు పడటం వల్ల వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈజీ మనీ కోసం డ్రగ్స్ దందా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలోని వసంత నగర్ బస్ స్టాప్ వద్ద గంజాయి విక్రయిస్తూ భరత్ రమేశ్ బాబు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి 1.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన సంతోష్ అనే వ్యక్తి తరచు అక్కడి నుంచి గంజాయి తీసుకువచ్చి రమేశ్ బాబుకి ఇచ్చి అమ్మకాలు చేస్తున్నాడు. అదే క్రమంలో శుక్రవారం కూడా ఖమ్మం నుంచి తీసుకువచ్చిన గంజాయిని రమేశ్ బాబుకు సంతోష్ ఇస్తున్న సమయంలో ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ సమయంలో సంతోష్ మాత్రం గంజాయి రమేశ్ బాబుకు ఇచ్చి చాకచక్యంగా పోలీసులకు చిక్కకుండా పరారయ్యాడు.
రమేశ్ బాబు నుంచి పోలీసులు 1.1 కేజీల గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రేతను అరెస్టు చేసిన పోలీస్ టీమ్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, ఎస్టీఎఫ్ డీఎస్పీ తిరుపతి యాదవ్ అభినందించారు.