మెల్‌బోర్న్ టెస్ట్.. కష్టాల్లో భారత జట్టు

     
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ స్కోరు 164/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 191 పరుగుల వద్ద రిషభ్ పంత్ (28), 221 పరుగుల వద్ద రవీంద్ర జడేజా (17) వికెట్లను కోల్పోయింది.

ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసిన భారత జట్టు ఆస్ట్రేలియా కంటే 246 పరుగులు వెనుకబడి ఉంది. నితీశ్‌కుమార్ రెడ్డి (28), వాషింగ్టన్ సుందర్ (1) క్రీజులో ఉన్నారు. భారత్ కోల్పోయిన ఏడు వికెట్లలో స్కాట్ బోలాండ్‌కు మూడు దక్కగా, కెప్టెన్ పాట్ కమిన్స్‌కు రెండు దక్కాయి. నాథన్ లియాన్ ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది.


More Telugu News