చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?: రోజా

  • కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుకుంటూ పోతోందన్న రోజా
  • పెంచిన ఛార్జీలను తగ్గించే వరకు పోరాటం ఆగదని వ్యాఖ్య
  • ఎన్నికల హామీలను చంద్రబాబు మర్చిపోయారని విమర్శ
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ ఈరోజు నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ... ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు మర్చిపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుకుంటూ పోతుంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని అడిగారు. పెంచిన ఛార్జీలను తగ్గించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 

విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, వీలైతే  తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై పెను భారాన్ని మోపుతున్నారని రోజా విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను పెంచితే ఒప్పుకోబోమన్న పవన్... ఈరోజు ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును పవన్ ఎందుకు నిలదీయలేకపోతున్నారని అన్నారు.


More Telugu News