భర్తతో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్న పీవీ సింధు

  • ఈ నెల 22న రాజస్థాన్ లో గ్రాండ్ గా సింధు వివాహం
  • భర్త వెంకటదత్త సాయితో కలిసి తిరుమల విచ్చేసిన సింధు
  • ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారి దర్శనం
ఇటీవలే వివాహం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇవాళ తన భర్త వెంకటసాయి దత్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన సింధు, వెంకటసాయి దత్తలను మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి. సింధు దంపతులకు మీడియా ప్రతినిధులు విషెస్ తెలియజేశారు. 

సింధు... పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటసాయి దత్తల వివాహం డిసెంబరు 22న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ నెల 24న వీరి పెళ్లి రిసెప్షన్ హైదరాబాద్ లో నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో, వెంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం నూతన దంపతులు తిరుమల వచ్చారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. సింధు సంప్రదాయబద్ధంగా పట్టుచీర కట్టుకోగా, వెంకటదత్త సాయి సల్వార్ దుస్తుల్లో కనిపించారు.


More Telugu News