ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్ ను నిలదీస్తున్నారు: మంత్రి సంధ్యారాణి

  • విద్యుత్ చార్జీలు పెంచారంటూ ధర్నాలు చేపడుతున్న వైసీపీ
  • జగన్ 10 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
  • చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శలు
ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల బాదుడుతో ప్రజలపై భారం మోపుతోందని వైసీపీ ధర్నాలు, ఆందోళనలు చేపడుతుండడం పట్ల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 10 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్ ను నిలదీస్తున్నారని వెల్లడించారు. ఆనాడు పరదాల మాటున నక్కి, ఇప్పుడొచ్చి ధర్నాలు చేస్తున్నారా? అని విమర్శించారు.

కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు: ప్రత్తిపాటి

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. అధికారం దక్కలేదన్న అక్కసుతో జగన్ కొత్త నాటకాలకు తెరలేపాడని వ్యాఖ్యానించారు. 

రాష్ట్ర విద్యుత్ రంగానికి జగన్ రూ.1.29 లక్షల కోట్ల మేర నష్టం కలుగజేశాడని ప్రత్తిపాటి ఆరోపించారు. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం వేయడానికి ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపింది జగనే అని, జగన్ తన పాలనలో 10 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని వివరించారు. విద్యుత్ చార్జీల పెంపు కూడా జగన్ అవినీతిలో భాగమేనని అన్నారు. 



More Telugu News