అల్లు అర్జున్ బెయిల్ పిటిష‌న్.. విచార‌ణ వాయిదా

  • సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసు
  • ఈ నెల 30కి వాయిదా ప‌డ్డ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ‌
  • కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డానికి స‌మ‌యం కోరిన పోలీసులు
  • వ‌ర్చువ‌ల్ గా విచార‌ణ‌కు హాజ‌రైన అల్లు అర్జున్‌
సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో న‌టుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ వాయిదా ప‌డింది. త‌న‌కు రెగ్యుల‌ర్ బెయిల్ ఇవ్వాల‌ని బ‌న్నీ నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ వేశారు. కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు పోలీసులు స‌మ‌యం కోర‌డంతో విచార‌ణ‌ను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్టు కోర్టు తెలిపింది. 

ఇక తొక్కిస‌లాట ఘ‌ట‌న నేప‌థ్యంలో బ‌న్నీని ఇటీవ‌ల పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. కానీ, ఆయ‌న‌కు హైకోర్టు నాలుగు వారాల మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వ‌డంతో విడుద‌ల‌య్యారు. మ‌రోవైపు నాంపల్లి కోర్టు ఈ నెల 13న విధించిన‌ 14 రోజుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో బ‌న్నీ ఈరోజు వ‌ర్చువ‌ల్‌గా న్యాయ‌స్థానం ముందు విచార‌ణ‌కు  హాజ‌ర‌య్యారు. 

కాగా, సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై విచార‌ణ‌నూ నాంప‌ల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 10న చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. అదే రోజు బ‌న్నీ రిమాండ్‌పైనా కూడా విచార‌ణ ఉండ‌నుంది.  


More Telugu News