మన్మోహన్ సింగ్ పై అనుపమ్ ఖేర్ హీరోగా సినిమా
- మన్మోహన్ సన్నిహితుడు సంజయ్ బారు పుస్తకం ఆధారంగా నిర్మాణం
- ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో రిలీజ్
- మన్మోహన్ పాత్రను పోషించిన అనుపమ్ ఖేర్
భారత ప్రధానిగా పదేళ్ల పాటు సేవలందించిన మన్మోహన్ సింగ్ జీవితంపై ఓ సినిమా కూడా రూపొందింది. మన్మోహన్ సన్నిహితుడు సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో నిర్మించారు. ఇందులో మన్మోహన్ పాత్రను బాలీవుడ్ హీరో అనుపమ్ ఖేర్ పోషించగా... సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. 2019లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ పరువు తీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది.
సినిమా విడుదలను అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. అప్పటికే సినిమాపై వివాదం రేగగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరింత ముదిరింది. లోక్ సభ ఎన్నికల ముంగిట ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఓటర్లపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. వివాదాలు రేగినా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసినా సినిమా విడుదల మాత్రం నిరాటంకంగా సాగిపోయింది. 2019 జనవరి 11న ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలోని పలు డైలాగ్ లపై అప్పట్లో సర్వత్రా చర్చ జరిగింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ 5 లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.