నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం

  • విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ఈరోజు సెల‌వు
  • ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి
  • అలాగే వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం చెందారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ఈరోజు సెల‌వు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి గురువారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేశారు. అలాగే వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు పాటించాల‌ని సీఎస్ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

మ‌రోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఇవాళ్టి (డిసెంబరు 27) ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రి మండ‌లి భేటీ కానుంది. కాగా, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు.


More Telugu News