కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌కే ఎక్కువ విరాళాలు... మొదటి స్థానంలో బీజేపీ

  • 2023-24లో బీజేపీకి 2,244 కోట్ల విరాళాలు
  • కాంగ్రెస్‌కు రూ.289 కోట్లు, బీఆర్ఎస్‌కు రూ.580 విరాళాలు
  • బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసీపీకి అత్యధికంగా విరాళం ఇచ్చిన ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్
2023-24 సంవత్సరంలో పార్టీలకు ఇచ్చిన డొనేషన్లలో తెలంగాణలోని ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను దాటవేసింది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌కు రూ.580 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం రూ.289 కోట్ల విరాళాలు వచ్చాయి. డొనేషన్లలో రూ.2,244 కోట్లతో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. రూ.20 వేలు అంతకంటే ఎక్కువ మొత్తంలో విరాళాల రూపంలో ఈ మొత్తం వచ్చింది.

అంతకుముందు ఏడాది కాంగ్రెస్ పార్టీకి రూ.79.9 కోట్లు మాత్రమే వచ్చాయి. గత సంవత్సరం బీజేపీకి రూ.776.82 కోట్ల విరాళాలు వచ్చాయి. అంటే, అంతకుముందు ఏడాదితో పోలిస్తే బీజేపీకి ఈసారి దాదాపు మూడు రెట్లు ఎక్కువగా విరాళాలు వచ్చాయి. ఈ ఏడాది ఏపీలో టీడీపీకి రూ.100 కోట్ల విరాళాలు వచ్చాయి.

ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం... బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చింది ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ బీజేపీకి రూ.723 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.156 కోట్లు ఇచ్చింది. ఇదే ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ బీఆర్ఎస్‌కు రూ.85 కోట్లు, ఏపీలోని వైసీపీకి రూ.62.5 కోట్లు ఇచ్చింది. అయితే ఈ రెండు పార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోలేకపోయాయి. 

2023-24 సంవత్సరానికి గాను ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.11.1 కోట్లు, సీపీఎం రూ.7.6 కోట్లు విరాళాల రూపంలో అందుకున్నాయి.


More Telugu News