సినీ పెద్దలతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
- సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
- పలువురు అధికారులు, సినీ పరిశ్రమ ప్రముఖులకు కమిటీలో చోటు
- అధికారులకు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖలు ఇవాళ (గురువారం) సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
సినీ ఇండస్ట్రీలోని సమస్యలను సినీ పెద్దలు ప్రస్తావించిన నేపథ్యంలో వీటి అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీలో పలువురు అధికారులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉండనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎం సూచనలు చేశారు. ఈ కమిటీ సినీ పరిశ్రమకు చెందిన అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తుంది.
టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలు, ఇండస్ట్రీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలను కూలంకషంగా పరిశీలించి నివేదిక రూపంలో ప్రభుత్వానికి పలు సిఫార్సులు అందజేయనుంది. ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు తీసుకోనుంది.