న‌డిరోడ్డుపై లంబోర్గినీ కారులో మంటలు.. వీడియో షేర్ చేసిన వ్యాపార‌ దిగ్గజం!

  • ముంబ‌యిలోని కోస్టల్ రోడ్‌లో ఘ‌ట‌న‌
  • కదులుతున్న లంబోర్గినీ కారులో ఒక్క‌సారిగా చెలరేగిన మంటలు
  • ఘ‌ట‌న తాలూకు వీడియోను పంచుకున్న‌ రేమండ్ గ్రూప్ అధినేత‌ గౌతమ్ సింఘానియా
ప్ర‌ముఖ ల‌గ్జరీ బ్రాండ్ కారు లంబోర్గినీలో మంట‌లు చెల‌రేగ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ముంబ‌యిలోని కోస్టల్ రోడ్‌లో బుధవారం రాత్రి కదులుతున్న లంబోర్గినీ కారులో ఇలా ఒక్క‌సారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 10.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

అయితే, ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేద‌ని అధికారులు వెల్ల‌డించారు. వెంటనే ఒక ఫైరింజ‌న్‌ను సంఘటనా స్థలానికి పంపినట్లు అగ్నిమాపక శాఖ‌ అధికారి ఒక‌రు తెలిపారు. దాదాపు 45 నిమిషాల్లో మంటలను ఆర్పివేసిన‌ట్లు పేర్కొన్నారు. ఇక ప్ర‌మాద స‌మ‌యంలో కారులో ఉన్న వారి వివ‌రాలు, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై కచ్చితమైన సమాచారం లేద‌న్నారు.

కాగా, ఈ ఘ‌ట‌న తాలూకు వీడియోను వ్యాపార‌ దిగ్గజం, రేమండ్ గ్రూప్ అధినేత‌ గౌతమ్ సింఘానియా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఇలాంటి సంఘటనలు లంబోర్గినీపై విశ్వసనీయత, భద్రతా ప్రమాణాల గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తాయ‌ని అన్నారు. 


More Telugu News