జగన్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న వైసీపీ అధినేత

  • పులివెందుల పర్యటనలో ఉన్న జగన్
  • సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం
  • సీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు
క్రిస్మస్ వేడుకల కోసం పులివెందులకు వెళ్లిన జగన్ వివిధ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. ప్రజల నుంచి ప్రస్తుతం జగన్ వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. వినతుల స్వీకరణ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. పులివెందుల నుంచి జగన్ రేపు బెంగళూరుకు తిరుగుపయనం కానున్నారు. 


More Telugu News