అల్లు అర్జున్ పంచాయతీలోకి బౌన్సర్లను ఎందుకు తెస్తున్నారు?: రఘునందన్ రావు

  • బౌన్సర్లను పెట్టుకొని జనాలను నెట్టే కార్యక్రమాన్ని తెచ్చిందే రేవంత్ రెడ్డి అని విమర్శ
  • సీవీ ఆనంద్‌కు చిత్తశుద్ధి ఉంటే బౌన్సర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బౌన్సర్లను పెట్టుకున్నారన్న రఘునందన్ రావు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో బౌన్సర్లను పెట్టుకొని జనాలను పక్కకు నెట్టే కార్యక్రమాన్ని తీసుకువచ్చారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అసలు అల్లు అర్జున్ పంచాయతీలోకి బౌన్సర్లను ఎందుకు తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు.

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు చిత్తశుద్ధి ఉంటే బౌన్సర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు బౌన్సర్లను తీసుకువచ్చి జనాల్ని నెట్టే సంస్కృతిని పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రారంభించారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బౌన్సర్లను పెట్టుకున్నారన్నారు.


More Telugu News