'నువ్వు నాకు నచ్చావ్' 100 సినిమాలు తెచ్చిపెట్టింది: పింకీ!

  • పింకీ పాత్ర ఎంతో పేరు తెచ్చిందన్న సుదీప
  • 100 సినిమాలు పూర్తి చేశానని వెల్లడి
  • సీరియల్స్ తోను బిజె అయ్యానని వ్యాఖ్య  
  • ఎవరినీ ఛాన్స్ అడిగే అవసరం రాలేదని వివరణ

'నువ్వు నాకు నచ్చావ్' .. వెంకటేశ్ - ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో 2001లో వచ్చిన సినిమా. ఈ సినిమా పేరు వినగానే 'పింకీ' అనే పాత్రను పోషించిన అమ్మాయి గుర్తుకు రాకుండా ఉండదు. ఆమె అసలు పేరు 'సుదీప' అయినప్పటికీ, 'పింకీ'గానే ఎక్కువ మందికి తెలుసు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప మాట్లాడుతూ తన గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

"మాది తాడేపల్లి గూడెం .. నేను 9th క్లాస్ చదువుతున్న సమయంలో 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఒక వైపున సినిమాలు చేస్తూనే తాడేపల్లిగూడెంలో డిగ్రీ వరకూ చదువుకున్నాను. ఆ తరువాతనే హైదరాబాద్ కి షిఫ్ట్ కావడం జరిగింది. 'నువ్వు నాకు నచ్చావ్'కి ముందు నేను ఒకటి రెండు సినిమాలు చేసి ఉంటాను. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ వెళ్లాను .. 100 సినిమాలు పూర్తిచేశాను" అని అన్నారు. 

" వెంకటేశ్ గారితో మాత్రమే కాదు, చిరంజీవిగారితో పాటు చాలామంది స్టార్స్ తో కలిసి నటించాను. ఒక్క నాగార్జునగారి సినిమాలో చేయడమే కుదరలేదు. నా కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి బిజీగానే ఉంటూ వచ్చాను. ముందుగా సినిమాలు .. పెళ్లి తరువాత సీరియల్స్ చేస్తూ వెళ్లాను. నాకు నేనుగా వెళ్లి ఎవరినీ అవకాశాలు అడగలేదు. అంత అవసరం రాలేదు కూడా" అని చెప్పారు. 



More Telugu News