శ్రీతేజ్‌కు వేణుస్వామి రూ.2లక్షల ఆర్థిక సాయం
- రేవతి భర్త భాస్కర్‌కు రూ. 2లక్షల చెక్కును అందజేసిన వేణుస్వామి
- శ్రీతేజ్ పేరిట మృత్యుంజయ హోమం కూడా చేస్తానని ప్రకటన
- బాధిత కుటుంబానికి 'పుష్ప-2' టీమ్ రూ. 2 కోట్ల భారీ పరిహారం
ఈ నెల 4న 'పుష్ప-2' ప్రీమియర్ షో తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సాయం చేశారు. రేవతి భర్త భాస్కర్‌కు రూ. 2లక్షల చెక్కును ఆయన అందజేశారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పేరిట మృత్యుంజయ హోమం కూడా చేస్తానని ఆయన ప్రకటించారు. అంతకుముందు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను వేణుస్వామి పరామర్శించారు.
ఇక బాధిత కుటుంబానికి 'పుష్ప-2' టీమ్ రూ. 2 కోట్ల భారీ పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తరపున రూ. కోటి, మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షలు ఇచ్చారు. రూ. 2 కోట్లకు చెందిన చెక్కులను దిల్ రాజుకు అందజేశారు.
అలాగే శ్రీతేజ్ వైద్యం కోసం సుకుమార్ సతీమణి తబిత రూ. 5లక్షలు అందజేశారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ కూడా రూ. 25లక్షల ఆర్థిక సహాయం అందజేసింది.