ఆ విమాన జర్నీ తర్వాత అంతా మారిపోయింది.. ఆ క్షణం నుంచి మా ప్రేమాయణం మొదలైంది: పీవీ సింధు
- పెళ్లి బంధంతో ఒక్కటైన పీవీ సింధు, వెంకట దత్తసాయి
- ఈ నెల 22న మూడుమూళ్ల బంధంలోకి అడుగుపెట్టిన జంట
- భర్త సాయితో తన ప్రేమ ప్రయాణం గురించి తాజాగా బయపెట్టిన సింధు
- తాము కలిసి చేసిన ఓ విమాన జర్నీ తమను మరింత దగ్గర చేసిందని వెల్లడి
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ నెల 22న రాత్రి 11.20 గంటలకు ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఇక మంగళవారం రాత్రి వీరి వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకట దత్తసాయితో తన లవ్ జర్నీ గురించి సింధు పంచుకుంది. సాయి తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ రెండేళ్ల క్రితం ఆయనతో కలిసి చేసిన ఓ విమాన జర్నీతోనే తమ ప్రేమ ప్రయాణం మొదలైందని ఆమె తెలిపింది.
"2022 అక్టోబరులో మేమిద్దరం కలిసి ఓ విమానంలో జర్నీ చేశాం. ఆ తర్వాత అంతా మారిపోయింది. ఆ ప్రయాణం మమ్మల్ని బాగా దగ్గర చేసింది. అదంతా 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్'లా అనిపించింది. ఆ క్షణం నుంచి మా ప్రేమ ప్రయాణం మొదలైంది" అని సింధు చెప్పుకొచ్చింది.
అలాగే ఇదే ఇంటర్వ్యూలో తన నిశ్చితార్థం గురించి తెలిపింది. చాలా తక్కువ మంది సమక్షంలోనే తమ నిశ్చితార్థం జరిగినట్లు పేర్కొంది. తమ జీవితంలో ముఖ్యమైన ఈ ఘట్టాన్ని తాము అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకోవాలని భావించామని, అందుకే గ్రాండ్‌గా చేయలేదని తెలిపింది. అది చాలా భావోద్వేగభరిత క్షణమని, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకమని అని 'వోగ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబుతూ పీవీ సింధు మురిసిపోయింది.