బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ ముందు అరుదైన హ్యాట్రిక్ రికార్డు!
- రేపటి నుంచి మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్, భారత్ బాక్సింగ్ డే టెస్టు
- కేఎల్ రాహుల్ ముందు బాక్సింగ్ డే టెస్టుల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసే అవకాశం
- తద్వారా అతనికి సచిన్, రహానే, కోహ్లీలను అధిగమించే ఛాన్స్
గురువారం నుంచి మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచుల సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచులు ముగిశాయి. ఇరు జట్లు చెరో విజయం సాధించగా, మరో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇక నాలుగో టెస్టు మ్యాచ్ రేపటి నుంచి మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో జరగనుంది.
అయితే, ఈ బాక్సింగ్ డే టెస్టులో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అదే.. బాక్సింగ్ డే టెస్టుల్లో హ్యాట్రిక్ సెంచరీలు. ఇప్పటికే 2021, 2023లో దక్షిణాఫ్రికాపై తాను ఆడిన రెండు బాక్సింగ్ డే టెస్టు మ్యాచుల్లో వరుసగా శతకాలు బాదాడు.
ఇప్పుడు రేపటి నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టెస్టులో కూడా సెంచరీ సాధిస్తే.. బాక్సింగ్ డే టెస్టుల్లో హ్యాట్రిక్ శతకాలు కొట్టిన ప్లేయర్‌గా రికార్డుకెక్కుతాడు. అలాగే సచిన్ టెండూల్కర్, అజింక్య రహానే, విరాట్ కోహ్లీలను అధిగమిస్తాడు. వీరు కూడా బాక్సింగ్ డే టెస్టుల్లో రెండు చొప్పున సెంచరీలు నమోదు చేశారు.