శాంతాక్లాజ్ గా కేజ్రీవాల్.. ఏఐ వీడియో ఇదిగో!
---
వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే ప్రచారం ప్రారంబించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తాజాగా మరో కొత్త వీడియోను ట్వీట్ చేసింది. క్రిస్మస్ సందర్భంగా కేజ్రీవాల్ ను శాంతాక్లాజ్ గా చూపిస్తూ శుభాకాంక్షలు తెలిపింది. కృత్రిమ మేధ సాయంతో తయారుచేసిన ఈ వీడియోలో కేజ్రీవాల్ శాంతాక్లాజ్ గా మారి ఢిల్లీ వాసులకు బహుమతులు అందించారు. ‘మహిళా సమ్మాన్ యోజన’ కింద మహిళలకు ప్రతినెలా రూ.2,100 ఆర్థికసాయం గిఫ్ట్ గా ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. క్రిస్మస్ కానుకలుగా ఆప్ సర్కార్ అమలు చేస్తున్న, హామీ ఇచ్చిన పథకాలను కేజ్రీవాల్ ప్రజలకు అందిస్తున్నట్లు వీడియోను రూపొందించారు. క్రిస్మస్ కు మాత్రమే కాదు ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ ఏడాది పొడవునా బహుమతులు ఇస్తూనే ఉన్నారని వ్యాఖ్యను జత చేసింది.