కజకిస్థాన్‌లో కుప్పకూలిన విమానం.. పెద్ద సంఖ్యలో మృతులు

  • అక్టౌ విమానాశ్రయానికి సమీపంలో కూలిన విమానం
  • ఫ్లైట్‌లో 105 మంది ప్రయాణీకులు, ఐదురురు సిబ్బంది
  • ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు ప్రాథమిక సమాచారం
కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 105 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో వెళుతున్న ‘అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్’కు చెందిన జే2-8243 విమానం అక్టౌ విమానాశ్రయానికి సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం కేవలం ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని కజకిస్తాన్ వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రమాదానికి గురైన విమానం అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని చెచ్న్యా‌లోని గ్రోజ్నీ‌కి వెళ్లాల్సి ఉంది. అయితే, దట్టమైన పొగమంచు కారణంగా విమానాన్ని దారి మళ్లించినట్టుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాగా, కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


More Telugu News