ఓటీటీ తెరపైకి మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ!
- టైటిల్ తో కుతూహలాన్ని పెంచిన సినిమా
- నవంబర్ 8న థియేటర్లలో విడుదల
- ఈ నెల 26 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్
- సైన్స్ ఫిక్షన్ ను టచ్ చేస్తూ సాగే కథ
ఈ మధ్య కాలంలో టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన సినిమాల జాబితాలో 'రహస్యం ఇదం జగత్' కూడా కనిపిస్తుంది. నవంబర్ 8వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అయితే థియేటర్లకు ఈ సినిమా వచ్చి వెళ్లిన సంగతి కూడా ఆడియన్స్ కి తెలియదు. సైన్స్ ఫిక్షన్ ను టచ్ చేస్తూ సాగే మైథలాజికల్ థ్రిల్లర్ ఇది. అలాంటి ఈ సినిమాకి కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఈటీవీ విన్' దక్కించుకుంది. ఈ సినిమాను రేపు స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. ఈ కథ అంత కూడా అమెరికాలో జరుగుతుంది. ప్రేమ - ప్రతీకారం అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
ఈ సినిమాలో రాకేశ్ .. స్రవంతి .. మానసవీణ .. భార్గవ్ గోపీనాథం .. ప్రధానమైన పాత్రలను పోషించారు. అకీరా (స్రవంతి) విదేశాలలో ఉంటుంది. తన తల్లిని చూడాలనిపించడంతో ఇండియాకి వెళ్లాలనుకుంటుంది. ఈ లోగా ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ ప్లాన్ చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఆ సంఘటన ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుంది? అనేది కథ.