ఖలిస్తానీ ఉగ్రవాదుల మృతదేహాలతో వెళ్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
- సోమవారం పిలిభిత్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
- వారి మృతదేహాలను పంజాబ్ తీసుకెళ్తుండగా రాంపూర్‌లో ప్రమాదం
- ఉద్దేశపూర్వకమా? ప్రమాదవశాత్తు జరిగిందా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు ‘ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్’ ఉగ్రవాదులను పంజాబ్‌కు తీసుకెళ్తున్న అంబులెన్స్‌ను గత రాత్రి పొద్దుపోయాక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రాంపూర్ బైపాస్‌పై జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, అయితే అంబులెన్స్ మాత్రం ధ్వంసమైందని చెప్పారు. మృతదేహాలను మరో వాహనంలో తరలించినట్టు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రాంపూర్ పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలను మరో అంబులెన్స్‌లోకి మార్చి పంజాబ్‌కు తరలించారు. గురుదాస్‌పూర్‌లోని పోలీస్ ఔట్ పోస్టుపై దాడిచేసిన ఖలిస్థానీ ఉగ్రవాదులు సోమవారం ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని పురానాపూర్‌లో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినా ఘటనా, లేదంటే ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.