రూ.26,999లకే ఐఫోన్ 15.. అనూహ్య ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

  • యాపిల్ ఐఫోన్ 15 బ్లాక్ వేరియెంట్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్
  • డీల్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్‌ ఆఫర్లతో కలుపుకొని రూ.26,999లకే ఐఫోన్
  • టెక్ ప్రియులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
ఐఫోన్ కొనుగోలు చేసేందుకు బెస్ట్ డిస్కౌంట్ డీల్స్ కోసం ఎదురుచూస్తున్న టెక్ ప్రియులకు గుడ్‌న్యూస్ వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఊహించని ఆఫర్ ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 15పై (128GB, బ్లాక్ వేరియంట్) ఊహించని డీల్‌ను ప్రకటించింది. రూ.69,990 విలువైన ఫోన్‌ను రూ.26,999లకే అందిస్తోంది.

డీల్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలుపుకొని ఈ భారీ తగ్గింపు లభిస్తోంది. గతంలో ప్రకటించిన అన్ని డిస్కౌంట్ ఆఫర్ల కంటే ఇదే అత్యుత్తమంగా ఉంది. ఎక్స్చేంజ్‌లో గరిష్ఠంగా రూ.31,500 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పించింది. ఎక్స్చేంజ్ ఆఫర్ మినహాయింపుతో అయితే గరిష్ఠంగా 16 శాతం తగ్గింపుతో రూ.58,499కు ఫోన్ లభిస్తోంది. కాగా, ఐఫోన్ 15 సెప్టెంబర్ 2023లో విడుదలైంది. 
 
ఐఫోన్ 15 ఫీచర్లు ఇవే
ఈ ఫోన్ 6.1-అంగుళాల స్క్రీన్‌తో, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో కూడిన 48 MP ప్రైమరీ కెమెరా ప్రత్యేక ఫీచర్లుగా ఉన్నాయి. ఫొటోలు హై-రిజల్యూషన్‌తో వస్తాయి. యూఎస్‌బీ-సీ కనెక్టివిటీ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. దీని ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్ కూడా సులభంగా చేసుకోవచ్చు. ఏ16 బయోనిక్ చిప్‌ సపోర్ట్‌తో పనితీరు స్పీడ్‌గా ఉంటుంది.


More Telugu News