మెల్‌బోర్న్ వీధుల్లో విరుష్క జోడీ చ‌క్క‌ర్లు.. ఇదిగో వీడియో!

  • మెల్‌బోర్న్ వేదిక‌గా ఆసీస్‌, భార‌త్ నాలుగో టెస్టు
  • ఇప్ప‌టికే మెల్‌బోర్న్ చేరుకున్న భార‌త జ‌ట్టు
  • భార్య అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి మెల్‌బోర్న్ వీధుల్లో న‌డుస్తూ క‌నిపించిన కోహ్లీ
  • నెట్టింట వీడియో వైర‌ల్
ఐదు మ్యాచుల బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌ కోసం ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మూడు టెస్టులు ముగిశాయి. ఇరు జ‌ట్లు చెరో విజ‌యం సాధించ‌గా, మ‌రో టెస్టు డ్రాగా ముగిసింది. గురువారం నుంచి మెల్‌బోర్న్ వేదిక‌గా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

ఈ టెస్టు కోసం ఇప్ప‌టికే టీమిండియా అక్క‌డికి చేరుకుని ప్రాక్టీస్ మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి మెల్‌బోర్న్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. దీని తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక బీజీటీ సిరీస్‌లో విరాట్ కోహ్లీ పేల‌వ‌మైన ఫామ్ కొన‌సాగు‌తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి టెస్టులో సెంచ‌రీ మిన‌హాయిస్తే త‌ర్వాత రెండు టెస్టుల్లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో అత‌నికి క‌లిసొచ్చిన మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో మ‌రోసారి బ్యాట్ ఝుళిపించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. 


More Telugu News