అగ్రిగోల్డ్ బాధితులకు సకాలంలో న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలి: ఏపీ సిఎస్

  • అగ్రిగోల్డ్ ఆస్తులపై సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
  • అగ్రిగోల్డ్ కు సంబంధించి వివిధ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎస్
  • పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించిన సీఐడీ ఐజి వినీత్ బ్రిజ్ లాల్
రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు సకాలంలో తగిన న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అగ్రిగోల్డ్ ఆస్తులపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు పోగొట్టుకున్న ఆస్తులను సకాలంలో వారికి తిరిగి చేర్చే విధంగా వివిధ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఐడీ, తదితర విభాగాల అధికారులను సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. 

ఈ సమావేశంలో సీఐడీ ఐజి వినీత్ బ్రిజ్ లాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ అగ్రిగోల్డ్ మోసానికి సంబంధించి మొత్తం 23 జిఓలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసు తొమ్మిది రాష్ట్రాలతో ముడిపడి ఉందని ఈ కంపెనీ అన్ని రాష్ట్రాల్లో కలిపి 19 లక్షల 18వేల 865 మంది డిపాజిట్‌దార్ల నుండి మొత్తం సుమారు 6,380 కోట్ల రూపాయల వరకూ వసూలు చేసి మోసం చేసిందని వివరించారు. ఈ కేసును వేగవంతంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. 

ఈ సమావేశంలో ఏపీ ఐఐసి విసీ అండ్ ఎండి అభిషిక్త్ కిషోర్, న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభా దేవి, హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్చువల్‌గా డీజీపీ ద్వారకా తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు. 


More Telugu News