రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఆదుకోవాలి: ఈటల రాజేందర్

  • సినిమా పరిశ్రమ మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎంపై ఆగ్రహం
  • నిండు ప్రాణం పోవడం బాధాకరమన్న ఈటల రాజేందర్
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్
సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని సినీ నటుడు అల్లు అర్జున్ అన్ని విధాలుగా ఆదుకోవాలని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. నిన్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నిర్లక్ష్యమైనా నిండు ప్రాణం పోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.

ప్రభుత్వం కూడా మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విచారణ పేరుతో అల్లు అర్జున్‌ను పిలిచి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్లే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు.


More Telugu News