ఈ చట్టంపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలి: నాదెండ్ల మనోహర్

  • విజయవాడలో సదస్సు... హాజరైన నాదెండ్ల
  • చట్టం వినియోగానికి సాంకేతిక పరిజ్ఞానం జోడించాల్సి ఉందని వెల్లడి 
  • గ్రామ, పట్టణ స్థాయిల్లో విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించాలని సూచన
వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుంటే జరిగే మోసాలను సులువుగా అరికట్టవచ్చని ఏపీ ఆహారం, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్బంగా వినియోగదారుల హక్కు చట్టంపై రాష్ట్రస్ధాయి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులతోపాటు సౌకర్యాలు గురించి, అవగాహన తీసుకురావలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.  

గతంలో ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన లేదన్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. 

ఈ ఏడాది వినియోగదారుల న్యాయపాలనకు వర్చువల్ విచారణలు, డిజిటల్ సౌలభ్యం ఇతివృత్తంగా తీసుకున్నారన్నారు. గ్రామ స్ధాయి నుండి పట్టణాల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గతంలో ఏదైనా వస్తువులు తయారు చేసినప్పుడు ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకునేవాళ్ళన్నారు. ఇప్పుడు అ పరిస్థితి లేదని అన్నారు.


More Telugu News