కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు... హెచ్‌సీఏ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు
- టెండర్ ప్రక్రియలో యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఎంపీ లేఖ
- నిర్ణయాధికారాలు కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్న ఎంపీ చామల
- సోదాలు నిర్వహించి రికార్డులు స్వాధీనం
హెచ్‌సీఏ కార్యాలయంపై విజిలెన్స్ శాఖ మెరుపు దాడులు చేసింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ టెండర్ల ఆరోపణలు రావడంతో అందుకు సంబంధించిన అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలు జరిగాయంటూ ఎంపీ ఫిర్యాదు చేశారు.
అంతర్జాతీయ మ్యాచ్ ల సందర్భంగా క్యాటరింగ్, రవాణా సేవల కోసం టెండర్ ప్రక్రియ విషయాల్లో యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గతంలో విజిలెన్స్ డీజీపీకి లేఖ రాశారు.
అపెక్స్ కౌన్సిల్‌తో సరైన సంప్రదింపులు లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని, నిర్ణయాధికారాలు కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. టెండర్ లేకుండానే ఐపీఎల్ కాంట్రాక్టులు ఇవ్వడం వంటి నిర్ణయాలు హెచ్‌సీఏ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయన్నారు. హెచ్‌సీఏ సమగ్రతను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి విజిలెన్స్ డీజీపీని కోరారు.