క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమాని కోసం అన్ని ఏర్పాట్లు చేయించిన ఎన్టీఆర్

  • క్యాన్సర్ బారినపడిన కౌశిక్ అనే అభిమాని
  • అప్పట్లో వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్
  • ఆ అభిమానిని ఎన్టీఆర్ విస్మరించారంటూ కొన్నిరోజులుగా కథనాలు
  • ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న ఎన్టీఆర్
  • తాజాగా ఎన్టీఆర్ టీమ్ దగ్గరుండి ఆ అభిమానిని డిశ్చార్జి చేయించిన వైనం
క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ అనే అభిమానికి సాయం చేస్తానని గతంలో ప్రకటించిన ఎన్టీఆర్ మాట తప్పాడంటూ కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి. ఆ అభిమానిని ఎన్టీఆర్ పట్టించుకోలేదని ప్రచారం జరిగింది. 

కానీ, ఎన్టీఆర్ ఆ అభిమాని కోసం అన్ని ఏర్పాట్లు చేయించారని తాజాగా వెల్లడైంది. తన టీమ్ ద్వారా ఆ అభిమాని యోగక్షేమాలు ఎప్పటికప్పుడు ఆరా తీసిన ఎన్టీఆర్, ఇప్పుడు ఆ అభిమానిని డిశ్చార్జి కూడా చేయించారన్న విషయం తెలిసింది. 

తాను చనిపోయేలోగా ఎన్టీఆర్ దేవర సినిమా చూడాలని క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ చివరి కోరిక కోరడం అప్పట్లో వైరల్ అయింది. ఆ బాలుడితో వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు.

ఈ నేపథ్యంలో, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ అభిమానిని ఎన్టీఆర్ టీమ్ తాజాగా దగ్గరుండి డిశ్చార్జి చేయించింది. దాంతో, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.


More Telugu News