బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది: ఏపీఎస్డీఎంఏ
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- రాగల 24 గంటల్లో బలహీనపడుతుందన్న ఏపీఎస్డీఎంఏ
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. బలపడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని... ఇది పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తూ రాగల 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.
దీని ప్రభావంతో ఏపీలో రాగల రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.