అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారంతా రేవంత్ రెడ్డితో ఫొటో దిగిన గూండాలే: హరీశ్ రావు
- సిద్దిపేటలోనూ క్యాంప్ కార్యాలయంపై దాడి చేశారని ఆగ్రహం
- ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావన్న హరీశ్ రావు
- గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే స్పందించడం లేదని ఆరోపణ
- చట్టం రేవంత్ రెడ్డికి చుట్టంగా మారిందని విమర్శ
జుబ్లీహిల్స్‌లోని సినీ నటుడు అల్లు అర్జున్ నివాసంపై దాడి చేసిన వారంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫొటో దిగిన కాంగ్రెస్ గూండాలేనని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డితో ఫొటో దిగిన వాళ్లే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారన్నారు. అంతకుముందు సిద్దిపేటలో కూడా గూండాలతో తన క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కేసులు పెట్టడం సరికాదన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, అందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. అల్లు అర్జున్ కేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డి చూపతున్న ఆసక్తి అన్ని వర్గాల మీద కూడా చూపించాలన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.
అదే సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకులాలు, హాస్టళ్లలో 50 మందికి పైగా పిల్లలు చనిపోతే ఇంతవరకు స్పందించలేదన్నారు. ఆ పిల్లల ప్రాణాలకు విలువలేదా? అని నిలదీశారు. నీ తమ్ముడి అరాచకాల వల్ల చనిపోతున్నానంటూ రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. ఇంతవరకు సీఎం తన తమ్ముడిని అరెస్ట్ చేయలేదన్నారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, కానీ రేవంత్ రెడ్డికి చుట్టంగా మారిందని విమర్శించారు.
ప్రశ్నించే గొంతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. భౌతిక దాడుల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తూ, తద్వారా ప్రశ్నించకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి సంస్కృతి తెలంగాణలో ఎప్పుడూ లేదన్నారు. రాయలసీమ తరహా ఫ్యాక్షనిస్ట్ సంస్కృతిని తెలంగాణలో తెచ్చి లా అండ్ ఆర్డర్‌ను రేవంత్ రెడ్డి కుప్పకూల్చుతున్నాడని ఆరోపించారు. ఈ సంస్కృతిని తెలంగాణ సమాజం హర్షించదన్నారు.