'శుభలేఖ రాసుకున్నా .. ' సాంగ్ నా కోసం అనుకున్నది: నటి దివ్యవాణి
- 'పెళ్లి పుస్తకం' గురించి ప్రస్తావించిన దివ్యవాణి
- 'మిస్టర్ పెళ్ళాం' తాను చేయవలసిందని వ్యాఖ్య
- 'బాపుబొమ్మ' అనిపించుకోవడం అదృష్టమని హర్షం
- చిరంజీవిగారితో తాను స్టెప్పులు వేయవలసిందని వెల్లడి
దివ్యవాణి .. 1990లలో కథానాయికగా వరుస సినిమాలు చేశారు. 'పెళ్లి పుస్తకం' .. 'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం' .. 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' సినిమాలతో వరుస విజయాలను అందుకున్న నాయిక ఆమె. అలాంటి దివ్యవాణి రీసెంటుగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"నేను ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సినిమాలు చేసిన తరువాత, ఇక ఇండస్ట్రీకి నేను సెట్ కానని అనుకున్నాను. తిరిగి వెళ్లిపోవడం మంచిదని నిర్ణయించుకున్నాను. అలాంటి పరిస్థితులలో నాకు 'బాపు' గారి నుంచి పిలుపు వచ్చింది. ఎన్ని సినిమాలు చేశాను అనేదాని కంటే, 'బాపు బొమ్మ'ను అనిపించుకోవడమే నాకు ఎంతో సంతోషాన్ని .. సంతృప్తిని ఇచ్చింది" అని అన్నారు.
'మిస్టర్ పెళ్ళాం' సినిమాలో నేను చేయవలసింది. చిరంజీవిగారి 'ఘరానా మొగుడు'లో వాణి విశ్వనాథ్ చేసిన రోల్ నేను చేయవలసింది. ఇక 'కొండవీటి దొంగ' సినిమాలో నేను చిరంజీవిగారి మరదలుగా చేశాను. 'శుభలేఖ రాసుకున్నా .. ' అనే సాంగ్ నా కోసం అనుకున్నది. చిరంజీవిగారి కాంబినేషన్లో మాపై చిత్రీకరించవలసింది. కానీ చివరి నిమిషంలో మారిపోయింది. ఇలాంటివి చాలానే జరిగాయి" అని చెప్పారు.