యూనివ‌ర్సిటీల‌కు దేవుళ్ల పేర్లు ఎందుకు.. మ‌రోసారి కంచె ఐల‌య్య‌ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

  • మ‌హిళా వ‌ర్సిటీకి తెలంగాణ ప్ర‌భుత్వం చాక‌లి ఐల‌మ్మ పేరు పెట్ట‌డం త‌ప్పేమీ కాద‌న్న ఐల‌య్య‌
  • వెంక‌టేశ్వ‌ర స్వామి, ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ఏమైనా చ‌దువు వ‌చ్చా? అని వ్యాఖ్య
  • ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై భ‌గ్గుమంటున్న స్వామివారి భ‌క్తులు
ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు. ఈసారి ఆయ‌న తిరుమ‌ల వెంక‌న్న‌, ప‌ద్మావతి అమ్మ‌వారిపై చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. మ‌హ‌బుబాబాద్ జిల్లా గూడురులో దొడ్డి కొమరయ్య విగ్ర‌హావిష్క‌ర‌ణకు ముఖ్య అతిథిగా హాజ‌రైన ఐల‌య్య మాట్లాడుతూ.. మ‌హిళా విశ్వ‌విద్యాల‌యానికి తెలంగాణ ప్ర‌భుత్వం చాక‌లి ఐల‌మ్మ పేరు పెట్ట‌డం త‌ప్పేమీ కాద‌న్నారు. 

ఆమె ఓ వీర వ‌నిత అని, యోధురాల‌ని కొనియాడారు. ఐల‌మ్మ బ‌ట్ట‌లు ఉతికి స‌మాజాన్ని శుద్ధి చేశార‌ని ఐల‌య్య పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో యూనివ‌ర్సిటీల‌కు దేవుళ్ల పేర్లు పెట్ట‌డం ఎందుక‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి, ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి ఏమైనా చ‌దువు వ‌చ్చా? అని వ్యాఖ్యానించారు. దాంతో ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు స్వామివారి భ‌క్తులు భ‌గ్గుమంటున్నారు.

ఇదిలాఉంటే.. గ‌తంలో కంచె ఐల‌య్య రాసిన సామాజిక స్మ‌గ్ల‌ర్లు.. కోమ‌టోళ్లు అనే బుక్ తెలుగు రాష్ట్రాల్లో వివాదానికి దారితీసిన విష‌యం తెలిసిందే.     


More Telugu News