గుడ్లను వీటితో కలిపి తింటే డేంజరే... అలా తింటే ఏమవుతుంది?
- సంపూర్ణమైన ఆహారంగా పేరున్న కోడిగుడ్లు
- మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలకూ అవి నిలయం
- కానీ కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు
మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలకు కోడిగుడ్లు నిలయం. పోషకాహార లోపాన్ని తరిమేసేందుకు తరచూ కోడిగుడ్లు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు కూడా. అయితే కోడిగుడ్లను కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తింటే సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు సరిగా అందకపోవడం, జీర్ణ సమస్యలు తదితర ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు.
గుడ్లు - చక్కెర
గుడ్లను, చక్కెరను కలిపి తీసుకోకూడదని... ముఖ్యంగా అత్యధిక వేడితో చేసే పదార్థాలతో కలిపి వాడొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే అందులో గ్లైకోటాక్సిన్లు ఏర్పడుతాయని... అవి దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని స్పష్టం చేస్తున్నారు.
గుడ్లు - పాలు
ఎక్కువ సంఖ్యలో గుడ్లను, పాలను కలిపి తీసుకుంటే... జీర్ణ వ్యవస్థ తీవ్రమైన ఇరిటేషన్ కు లోనవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు.
గుడ్లు - టీ/కాఫీ
గుడ్లు, గుడ్లతో చేసిన పదార్థాలు తీసుకున్న వెంటనే టీ గానీ, కాఫీ గానీ తాగితే.. మన శరీరం ఐరన్ ను సంగ్రహించుకోలేపోతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో జీర్ణ వ్యవస్థలో ఇరిటేషన్ కూడా ఏర్పడుతుందని వివరిస్తున్నారు.
గుడ్లు - సోయా మిల్క్
సోయా మిల్క్ లో ఉండే ‘ట్రిప్సిన్ ఇన్హిబిటర్లు’ ప్రొటీన్లు జీర్ణం కాకుండా అడ్డుకుంటాయని.. గుడ్లతోపాటు సోయా మిల్క్ తీసుకుంటే పోషకాలు అందకుండా పోతాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అజీర్తి, ఇతర జీర్ణ సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు.
గుడ్లు - చేపలు
ఈ రెండు ఆహార పదార్థాలను కలిపిగానీ, ఒకదాని తర్వాత వెంటనే మరొకటిగానీ తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుడ్లు - విటమిన్ సీ ఎక్కువగా ఉండే పళ్లు
విటమిన్ సీ ఎక్కువగా ఉండే నారింజ, బత్తాయి, నిమ్మ వంటి వాటిని గుడ్లతో కలిపిగానీ, వెంటవెంటనే గానీ తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఆ పళ్లలోని అధిక ఎసిడిటీ వల్ల గుడ్లలో ఎక్కువగా ఉండే ప్రొటీన్ జీర్ణం కాకుండా ఉంటుందని... ఇది జీర్ణ సంబంధ సమస్యలకు దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఇక చీజ్, బట్టర్ వంటివాటిని, మాంసాన్ని కూడా గుడ్లతో కలిపి తీసుకోకపోవడం మంచిదని... కలిపి తీసుకుంటే పొట్టలో ఉబ్బరం, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.