పుష్ప-2 టీమ్ కు కంగ్రాట్స్ చెప్పిన యశ్ రాజ్ ఫిలింస్

  • డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2
  • రికార్డులు తిరగరాస్తూ, కొత్త చరిత్ర సృష్టించిన చిత్రం
  • బాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డులు కూడా బద్దలు
విడుదలైన రోజు నుంచే రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్న చిత్రం పుష్ప-2. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు రూ.1,500 కోట్ల గ్రాస్ తో బాక్సాఫీసు చరిత్రను తిరగరాసింది. ఈ క్రమంలో బాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డులు కూడా బద్దలయ్యాయి. రూ.680 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లతో పుష్ప-2 బాలీవుడ్ దుమ్ముదులిపింది. 

ఈ నేపథ్యంలో, బాలీవుడ్ లో సుప్రసిద్ధ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ ఓ ప్రకటన చేసింది. పుష్ప-2 టీమ్ మొత్తానికి శుభాభినందనలు తెలిపింది. 

"రికార్డులున్నది బద్దలవడానికే. పాత రికార్డులు పోతుంటాయి... కొత్త రికార్డులు వస్తుంటాయి. మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా ప్రతి ఒక్కరినీ కొత్త రికార్డులు ముందుకు నెడుతుంటాయి. చరిత్ర పుస్తకాలను తిరగరాస్తున్నందుకు యావత్ పుష్ప-2 చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్. ఫైర్ నహీ... వైల్డ్ ఫైర్ (మామూలు ఫైరు కాదు... వైల్డ్ ఫైరు)" అంటూ యశ్ రాజ్ ఫిలింస్ తన ప్రకటనలో పేర్కొంది.


More Telugu News